కోహ్లీ ఫొటో, రికార్డుల టాటూలతో నిండిపోయిన అభిమాని శరీరం.. దగ్గరకు తీసుకుని వాటేసుకున్న కెప్టెన్!

  • అభిమాని శరీరంపై తన ఫొటో చూసి షాకైన కోహ్లీ
  • విశాఖ స్టేడియంలో ఘటన
  • సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్
దీనిని ఏమంటారో తెలియదు కానీ ఓ అభిమాని కోహ్లీ ఫొటో, జెర్సీ నంబరు, అతడు సాధించిన రికార్డులు.. ఇలా అన్నింటినీ తన శరీరంపై పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. అది చూసిన కోహ్లీ ఉద్వేగంతో ఉప్పొంగిపోయాడు. అతడిని దగ్గరకు తీసుకుని వాటేసుకున్నాడు. విశాఖపట్టణంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో ఈ ఘటన చోటుచేసుకుంది.

మ్యాచ్ ప్రారంభానికి ముందు మైదానంలో ఇరు జట్లు ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఈ క్రమంలో తనను కలిసిన ఓ అభిమానిని చూసి కోహ్లీ తొలుత ఆశ్చర్యపోయాడు. తన ఫొటో, జెర్సీ నంబరు, తాను సాధించిన రికార్డులు ఇలా.. అన్నీ అభిమాని శరీరంపై పచ్చబొట్టు రూపంలో కనిపించడంతో కోహ్లీ ఓ క్షణం షాక్‌కు గురయ్యాడు. ఆ వెంటనే తేరుకుని అతడిని దగ్గరకు తీసుకుని వాటేసుకున్నాడు. అతడితో కలిసి ఫొటో దిగాడు. సోషల్ మీడియాలో ఇప్పుడీ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
Go Back to Shorts
Virat Kohli
Visakhapatnam District
test match
fan
tattoo

More Telugu News